పలు విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు
గోదావరిఖని, సెప్టెంబర్ 7 – అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
కర్నూలులోని పుష్పరాజ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన 13వ జి.కె.ఎం.ఎస్. నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్–2026లో గోదావరిఖనికి చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ప్రతిభ చాటారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 3,155 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ జాతీయస్థాయి పోటీల్లో గోదావరిఖని విద్యార్థులు కటాస్, కుమితే విభాగాల్లో పోటీపడి పలు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించారు.
కటాస్ విభాగంలో పతకాల పంట
బ్లాక్ బెల్ట్ కటాస్ విభాగంలో
- టీ. జయ సాయి చరణ్, సహస్ర – స్వర్ణ పతకాలు
- స్పందన, వశికర్, సాయి రోషన్, ప్రణీత్, అశ్విత్ రెడ్డి – రజత, కాంస్య పతకాలు
ఆల్ కలర్ బెల్ట్ కటాస్ విభాగంలో
- ఆయాన్ష్, భార్గవ రామ, ఆదిత్రి – స్వర్ణ పతకాలు
- శ్రీనందన్, బి. సాత్విక్, హ్రీధ్య రెడ్డి, శర్వాణి – రజత పతకాలు
- ఇతర విద్యార్థులు – కాంస్య పతకాలు సాధించారు.
కుమితే విభాగంలోనూ మెరుపు
బ్లాక్ బెల్ట్ కుమితే విభాగంలో
- టీ. జయ సాయి చరణ్, యజ్ఞశ్వర్ రెడ్డి, వశికర్ – స్వర్ణ పతకాలు సాధించారు.
ఆల్ కలర్ బెల్ట్ కుమితే విభాగంలో
- ఆయాన్ష్, భార్గవ రామ – స్వర్ణ పతకాలు
- బి. సాత్విక్, ఆదిత్రి – రజత పతకాలు
- ఇతర విద్యార్థులు – కాంస్య పతకాలు సాధించారు.
జాతీయస్థాయి పోటీల్లో తమ ప్రతిభను చాటుకుని పలు పతకాలు సాధించిన విద్యార్థులను వారి కోచ్ పసునూటి చందు అభినందించారు.
విద్యార్థులు, కోచ్ చందును FSKAI ఇండియా చీఫ్ రచ్చ శ్రీనుబాబు, జిల్లా కరాటే మాస్టర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని గోదావరిఖని ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply