మంథని, సెప్టెంబర్ 7: మంథని మండలం బిట్టుపల్లి గ్రామానికి చెందిన మహేందర్–లావణ్య దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో సోమవారం నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని నూతన గృహంలోకి వారిని ఆహ్వానించారు. అనంతరం మహేందర్–లావణ్య దంపతులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అయిలి ప్రసాద్ మాట్లాడుతూ.. పేద, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ఎవరూ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, లబ్ధిదారులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మంథని ప్రాంత అభివృద్ధికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ తదితర పథకాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
నూతన గృహప్రవేశం సందర్భంగా మహేందర్–లావణ్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రి శ్రీధర్ బాబుకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకుల కిరణ్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి ఆరెల్లి కిరణ్, ఉపసర్పంచ్ రాయమల్లు, బిట్టుపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు పోగుల సాగర్, వేముల సతీష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
– అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, మంథని









Leave a Reply