నూతన పట్టు వస్త్ర అలంకరణలో పాల్గొని ఆశీర్వదించిన
టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ యేకుల రాజారావు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం వంగూరు గేటు వద్ద ఉన్న వై వి ఫంక్షన్ హాల్ లో బుధవారం గుండ్లపల్లి మండలం తవ్క్లాపురం గ్రామానికి చెందిన నూనె అరుణశ్రీ – ప్రసాద్ దంపతుల కుమార్తె స్నగ్ధ మరియు కుమారుడు రిత్విక్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, బహుజన మేధావి, పూలే -అంబేద్కర్ ఆశయసాధకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ యేకుల రాజారావు .
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. స్నగ్ధ, రిత్విక్, ఉన్నత విద్యను అభ్యసించి, సంస్కారంతో , జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మేడ సైదులు, అంజి,మాల మహానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేపూరి మురళి , దేవరకొండ పోలీస్ నిఘా రిపోర్టర్ పులిజాల గోవర్ధన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నార









Leave a Reply