ఈద్గా మైదానంలో ‘నమాజ్-ఎ-ఇస్తిస్కా’ నిర్వహణ
దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:
దేవరకొండ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పంటలు పచ్చగా కళకళలాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ దేవరకొండ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు దేవరకొండ ఈద్గా మైదానంలో ‘నమాజ్-ఎ-ఇస్తిస్కా’ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రజల సంక్షేమం, రైతుల శ్రేయస్సు, పంటలకు అనుకూలమైన వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.
సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజల సంక్షేమం కోసం అల్లాహ్‌ను వేడుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవరకొండ ఈద్గా కమిటీ, మదర్సా మిస్బా ఉల్ ఉలూమ్, జమీయత్ ఉలేమా-ఎ-హింద్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
— అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply