చందంపేట: మండలంలోని బొడ్డోనితండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేనావత్ దసురు నాయక్ రెండు రోజుల క్రితం విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషయం తెలుసుకున్న PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి బుధవారం ఆయన స్వగృహానికి వెళ్లారు.
ఈ సందర్భంగా దసురు నాయక్ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తక్షణ సహాయంగా రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. దసురు నాయక్ పిల్లల చదువులకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, సర్పంచ్ చిట్టెమ్మ లాల్ సింగ్, మాజీ సర్పంచ్ బాలు, మాజీ ఉప సర్పంచులు యాదయ్య, బాలు, డైరెక్టర్ అంకులయ్య, ఇప్ప తిరుపతి రెడ్డి, చాట్ల వెంకటయ్య, వార్డు సభ్యులు వెంకటాచారి, ఆంజనేయులు, చాట్ల బలరాం, బడేటి కిష్టయ్య, పోలగొని వెంకటయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
— Ayush 24 News
The Voice Of Truth
నేనావత్ దసురు నాయక్ కుటుంబానికి అండగా జాలే నరసింహారెడ్డి
చందంపేట: మండలంలోని బొడ్డోనితండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేనావత్ దసురు నాయక్ రెండు రోజుల క్రితం విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషయం తెలుసుకున్న PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి బుధవారం ఆయన స్వగృహానికి వెళ్లారు. ఈ సందర్భంగా దసురు నాయక్ చిత్రపటానికి నివాళులర్పించి,


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply