Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు
Home › బ్రేకింగ్ న్యూస్ › RTI సమాచారం ఇవ్వడంలో జాప్యంపై రాష్ట్ర సమాచార కమిషన్ చర్యలు
బ్రేకింగ్ న్యూస్

RTI సమాచారం ఇవ్వడంలో జాప్యంపై రాష్ట్ర సమాచార కమిషన్ చర్యలు

దేవరకొండ: సమాచార హక్కు చట్టం–2005 నిబంధనలను పాటించకుండా, నిర్ణీత గడువులోగా సమగ్ర సమాచారం అందించడంలో నిర్లక్ష్యం వహించినందుకు దేవరకొండ మండల విద్యాధికారి (MEO) మాతృ నాయక్‌కు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ₹2,000 జరిమానా విధించింది. శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన పలు అంశాలపై RTI ద్వారా సమాచారం

11:30 ఉదయం AM

దేవరకొండ: సమాచార హక్కు చట్టం–2005 నిబంధనలను పాటించకుండా, నిర్ణీత గడువులోగా సమగ్ర సమాచారం అందించడంలో నిర్లక్ష్యం వహించినందుకు దేవరకొండ మండల విద్యాధికారి (MEO) మాతృ నాయక్‌కు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ₹2,000 జరిమానా విధించింది.
శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన పలు అంశాలపై RTI ద్వారా సమాచారం కోరిన రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (RTISS) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కె. బాబురామ్ నాయక్ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నెం. 1139/SIC-DB/2026పై గురువారం విచారణ జరిగింది.
20 కీలక అంశాలపై సమాచారం కోరిన బాబురామ్ నాయక్
దేవరకొండ ముదిగొండ రోడ్డులోని శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన గుర్తింపు, అనుమతులు, 9, 10 తరగతుల నిర్వహణ, గతంలో సీజ్ చేసిన ప్రవేశ కేంద్రాన్ని డీ-సీలింగ్ చేసిన వివరాలు, భవన భద్రత, ఫైర్ NOC, పరిసర ప్రాంతంలోని బార్ & రెస్టారెంట్‌పై తనిఖీ నివేదికలు, నలంద ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఉన్న గుర్తింపు మరియు శ్రీ చైతన్య పేరుతో నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలు తదితర 20 అంశాలపై బాబురామ్ నాయక్ RTI చట్టంలోని సెక్షన్ 6(1) కింద సమాచారం కోరినట్లు తెలిపారు.
అయితే కోరిన సమాచారంపై అరకొర సమాధానాలు మాత్రమే అందాయని, మొదటి అప్పీల్‌పైనా తగిన స్పందన రాలేదని పేర్కొంటూ ఆయన రాష్ట్ర సమాచార కమిషన్‌లో రెండో అప్పీల్ దాఖలు చేశారు.
అధికారులపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం
విచారణ సందర్భంగా ఫిర్యాదుదారు కె. బాబురామ్ నాయక్ ఆధారాలతో కూడిన అఫిడవిట్‌ను కమిషన్‌కు సమర్పించారు. విచారణకు హాజరైన DEO, RJD, MEOల నుంచి వివరాలు తీసుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్, సమాచార హక్కు చట్టం అమలులో జాప్యంపై అధికారులను హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
సమాచారాన్ని సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం వహించినందుకు దేవరకొండ MEO మాతృ నాయక్‌కు ₹2,000 జరిమానా విధిస్తూ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా, దరఖాస్తుదారు కోరిన 20 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని 15 రోజుల్లోగా ఉచితంగా అందించాలని కమిషన్ ఆదేశించింది. ఆదేశాలను నిర్దేశిత గడువులో అమలు చేయకపోతే బాధ్యులైన అధికారులపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం.
— Ayush 24 News
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 40🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
262 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App