శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ యువతకు రూ.54 వేల విలువైన సౌండ్ సిస్టమ్
చందంపేట, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి, తిలక్ రెడ్డి డీజే సౌండ్ బాక్స్‌లను అందజేశారు.
వినాయక ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద కార్యక్రమాల నిర్వహణ కోసం సుమారు రూ.54,000 విలువైన డీజే సౌండ్ బాక్స్‌లను అందించినట్లు యువత తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ తమ అభ్యర్థనకు స్పందించి సౌండ్ సిస్టమ్ అందించిన నరసింహారెడ్డి, తిలక్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులు దాతలు, వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దమ్మ శ్రీనయ్య, వెంకటయ్య, శ్రీను, ఆంజనేయులు, రాజు, సైదులు, మహేష్, అనిల్, ముత్యం, శివ, పరమేశ్, నరసింహ, కొండల్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply