దేవరకొండలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
దేవరకొండ, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా దేవరకొండ రూరల్ మండలం, దేవరకొండ పట్టణంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు పాల్గొని నాటి పోరాటంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమాల్లో దేవరకొండ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి కేతావత్ లాలూ నాయక్తో కలిసి పాల్గొన్నట్లు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్ర బిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న వారి త్యాగాలను స్మరించుకున్నారు.
ఎర్ర బిక్షపతి మాట్లాడుతూ.. నిజాం పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు, ధైర్యసాహసాలు, దేశభక్తి భావాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాధాన్యతను, అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు.

దేశ సమైక్యత, అఖండత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
— ఎర్ర బిక్షపతి
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు










Leave a Reply