సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాకు గురువారం వినతిపత్రం అందజేశారు.
డీఎంహెచ్వో పరిధి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి బదిలీ చేసిన 104 ఉద్యోగులకు కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేయాలని ఉద్యోగులు కోరారు. బదిలీ జరిగి ఏడు నెలలు గడిచినా ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లకు ఏడు నెలలుగా వేతనాలు అందలేదని ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నుస్రత్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తాము సుమారు 18 ఏళ్లుగా సేవలందిస్తున్నామని, తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగులు శివరాజ్, కల్యాణ్, కిరణ్, మధుకర్, నిజాం, విజయ్, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply