7 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (అయుష్ 24 న్యూస్ ప్రతినిధి): 104 FDHSలో గతంలో విధులు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకు కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేసి, పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (TUM&HEU–CITU) డిమాండ్ చేసింది.
ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో డీఎంఈ అధికారులకు వినతిపత్రం అందజేశారు. 2026 జనవరి 24న Rc.No.330/P4/2026 ద్వారా 104 FDHS సిబ్బందిలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులను డీఎంఈ పరిధిలోకి రీ-డిప్లాయ్ చేసినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.
2008 నుంచి 104 సేవల్లో విధులు
యూనియన్ వివరాల ప్రకారం.. సంబంధిత సిబ్బంది 2008 నుంచి 2022 వరకు 104 FDHS వాహనాల్లో విధులు నిర్వహించారు. 2022లో 104 సేవలు రద్దు చేసిన అనంతరం సిబ్బందిని DM&HO పరిధిలోని వివిధ విభాగాల్లో విధులకు కేటాయించారు. అనంతరం 2026 జనవరి 24న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులను డీఎంఈ పరిధిలోకి రీ-డిప్లాయ్ చేశారు.
అయితే రీ-డిప్లాయ్మెంట్ అనంతరం కంటిన్యూయేషన్ ఆర్డర్లు లేకపోవడంతో IFMISలో పేర్లు నమోదు కావడం లేదని, ఫలితంగా జీతాల చెల్లింపులో సమస్యలు ఏర్పడ్డాయని యూనియన్ పేర్కొంది.
పెండింగ్ జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి
18 సంవత్సరాలుగా సేవలందిస్తున్న సిబ్బందికి ఉద్యోగ కొనసాగింపు ఉత్తర్వులతో పాటు పెండింగ్ జీతాలకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని యూనియన్ కోరింది. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ, పిల్లల విద్యా ఖర్చులు, ప్రయాణ ఖర్చులు వంటి వాటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేసినట్లు యూనియన్ తెలిపింది.

సిబ్బందికి Continuation Orders జారీ చేయడంతో పాటు సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, పెండింగ్లో ఉన్న పాత జీతాలతో పాటు ప్రస్తుత జీతాలను కూడా వెంటనే చెల్లించాలని TUM&HEU–CITU ప్రతినిధులు అధికారులను కోరారు.
ఈ సందర్భంగా CITU రాష్ట్ర కార్యదర్శి నవీన్ తదితర యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply