Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు
Home › బ్రేకింగ్ న్యూస్ › వరి సాగులో నీటి సమర్థ వినియోగంతో అధిక దిగుబడులు సాధించాలి
బ్రేకింగ్ న్యూస్

వరి సాగులో నీటి సమర్థ వినియోగంతో అధిక దిగుబడులు సాధించాలి

04:08 సాయంత్రం PM

రైతు బలపడితేనే దేశం అభివృద్ధి చెందుతుంది: బుద్ధార్తి నవీన్ పటేల్

పెద్దపల్లి, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): వరి సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ నీటిని సమర్థవంతంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు.

పెద్దపల్లి పట్టణ పరిధిలోని రంగంపల్లి వెంకట పద్మ ఫంక్షన్ హాల్‌లో సౌ & రీప్ క్లైమేటెక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వరి సాగు రైతుల అభినందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నీటి సమర్థ వినియోగ పద్ధతి **ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (AWD)**ను అనుసరించిన రైతులకు ఎకరాకు రూ.500 చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాంప్రదాయ సాగు విధానాల నుంచి ఆధునిక సాంకేతిక పద్ధతుల వైపు మారాల్సిన అవసరం ఉందన్నారు. వరి పంటకు అవసరమైన సమయంలో మాత్రమే నీటిని అందించడం ద్వారా నీటి వృథాను తగ్గించడంతో పాటు పంట దిగుబడులను మెరుగుపరచవచ్చని తెలిపారు.

పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల పరిధిలో రైతులను ఆధునిక వరి సాగు పద్ధతుల వైపు ప్రోత్సహించేందుకు సౌ & రీప్ క్లైమేటెక్ సంస్థ చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. ఆధునిక సాగు పద్ధతులను అనుసరించి విజయవంతమైన రైతులు తమ అనుభవాలను తోటి రైతులతో పంచుకోవాలని ఆయన సూచించారు.

మంథని ప్రాంతంలోనూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు అడ్వకేట్, యువ జనతా ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్ధార్తి నవీన్ పటేల్ మాట్లాడుతూ.. రైతులకు ప్రయోజనం చేకూర్చే ఇలాంటి కార్యక్రమానికి తనను ఆహ్వానించిన సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

సౌ & రీప్ క్లైమేటెక్ సంస్థ ఆధ్వర్యంలో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు సుమారు రూ.20 లక్షలకు పైగా ప్రోత్సాహకాలను అందించడం అభినందనీయమన్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులకు పంట దిగుబడి పెరగడంతో పాటు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇలాంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమాలను జిల్లాలోని కొన్ని గ్రామాలకే పరిమితం చేయకుండా మంథని ప్రాంతంలోనూ విస్తృతంగా నిర్వహించాలని సంస్థ ప్రతినిధులను కోరారు. రైతు బలపడితే గ్రామం, జిల్లా బలపడతాయని, రైతు అభివృద్ధి చెందితేనే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని నవీన్ పటేల్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏడీ కంఠయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీనాథ్, డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (పెద్దపల్లి), తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తూము రవీందర్ పటేల్, ఎంఏఓ నాగార్జున పాల్గొన్నారు.

సౌ & రీప్ క్లైమేటెక్ సంస్థ తరఫున సీఓఓ ఎన్. మురళీధర్, డైరెక్టర్ డి. దివ్యా రెడ్డి, ఆపరేషన్స్ మేనేజర్ సీహెచ్. వెంకట రమణ, ఎన్‌బీఎస్ హెడ్ పృథ్వీరామ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి. స్వప్నతో పాటు సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 20🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App