Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు
Home › బ్రేకింగ్ న్యూస్ › తిదేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ భాషా దినోత్సవం
బ్రేకింగ్ న్యూస్

తిదేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ భాషా దినోత్సవం

02:39 తెల్లవారుజాము AM

విద్యార్థులను ప్రోత్సహించిన వైద్యుల కృష్ణమూర్తి

తిదేడు, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): చింతపల్లి మండలం తిదేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. సురేందర్ అధ్యక్షతన, హిందీ ఉపాధ్యాయులు లెంకల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమానికి వెంకటంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు డాక్టర్ చలపతిరావు కుమారుడు వైద్యుల కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. హిందీ భాషను నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని, భాషలపై పట్టు సాధించడం విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

2026 పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని జి. సౌమ్యకు ప్రతిభా అవార్డుతో పాటు నగదు బహుమతిని కృష్ణమూర్తి అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు కృష్ణమూర్తి చేస్తున్న సేవలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు.

హిందీ ఉపాధ్యాయులు లెంకల రామిరెడ్డి మాట్లాడుతూ.. హిందీ భాష నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో తన మిత్రుడు కృష్ణమూర్తి 2027 సంవత్సరానికి కూడా ప్రోత్సాహక బహుమతులు ప్రకటించడం అభినందనీయమని, ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

హిందీ భాషా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పద్మ, వై. శ్రీరాములు, పి. శ్రీరాములు, జి. దేవకుమార్, ఈ. విష్ణుకాంత్, పి. వాసుదేవరెడ్డి, కె. చందూలాల్ తదితరులతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 148🔗 Shares: 5👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
220 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App