Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కుక్కల బెడద
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కుక్కల బెడద

02:42 తెల్లవారుజాము AM

వార్డుల్లోకి వీధి కుక్కలు చొరబడుతున్నాయని రోగుల ఆవేదన

దేవరకొండ, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వీధి కుక్కల సంచారం రోగులు, వారి బంధువులకు ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రి వార్డుల్లోకి కూడా కుక్కలు నేరుగా ప్రవేశిస్తున్నాయని రోగులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆసుపత్రిలో తగిన స్థాయిలో వాచ్‌మెన్, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే పరిస్థితి ఇలా మారిందని కొందరు రోగులు ఆరోపిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఆసుపత్రి ప్రాంగణంలో కుక్కలు సంచరిస్తుండటంతో ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.

ఇదిలా ఉండగా, సెక్యూరిటీ విధుల్లో ఉన్న కొందరు సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించకుండా ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.

ఆసుపత్రి ప్రాంగణంలో వీధి కుక్కల సమస్యను తక్షణమే పరిష్కరించడంతో పాటు, సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టం చేయాలని రోగులు, వారి బంధువులు అధికారులను కోరుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలితే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రోగుల భద్రతకు సంబంధించిన ఈ సమస్యపై ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రోగులు కోరుతున్నారు.

— ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 17🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
72 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App