వృద్ధుల సంక్షేమ పథకాలు, చట్టాలపై అవగాహన.. ప్రత్యేక వైద్య శిబిరం
AYUSH24 News ప్రతినిధి
మంథని: సెప్టెంబర్ 29
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంథనిలోని ప్రణామ్ డే కేర్ సెంటర్లో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వయోవృద్ధుల సంక్షేమం, వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, చట్టపరమైన హక్కులు, సహాయ సేవలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ గౌరవ కార్యదర్శి శ్రీనిజ కోయిర్కర్ హాజరై వయోవృద్ధుల సంక్షేమం, వారికి అందుబాటులో ఉన్న న్యాయ సేవల గురించి వివరించారు.
సీడీపీఓ పుష్పలతతో పాటు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది రాజయ్య (సూపరింటెండెంట్), స్వర్ణలత (ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్) పాల్గొని వయోవృద్ధులకు ఉపయోగపడే టోల్‌ఫ్రీ నంబర్లు, సంక్షేమ పథకాలు, చట్టాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా వయోవృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎంఎల్‌హెచ్‌పీ మంథని-1 డాక్టర్ శివాని ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు.
కార్యక్రమంలో న్యాయవాదులు శశిభూషణ్ కాచే, షబానా, జి. శ్రీలక్ష్మి, డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ పుష్పలతతో పాటు సీనియర్ సిటిజన్లు కాజా మొయినుద్దీన్, వేపచెట్టు రాజన్న, నూనె రాజేశం, రాజమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply