విద్యార్థులు ఆలోచనలకు పదును పెట్టాలి: లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య
AYUSH24 News ప్రతినిధి
దేవరకొండ: సెప్టెంబర్ 30
విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య అన్నారు. దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై, బెల్టులను అందజేశారు.
ముదిగొండ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కాశిరెడ్డి రఘుమారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి (రైతు మిత్ర ఏజెన్సీస్, దేవరకొండ) ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బుద్దేటి జంగయ్య మాట్లాడుతూ శిలను శిల్పంగా తీర్చిదిద్దినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో ఇతరులకు సహాయం చేసే గుణంతో పాటు విద్యాబుద్ధులను పెంపొందించాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పోటీపడి చదువుతూ ఆలోచనలకు పదును పెట్టి, ప్రపంచానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని సూచించారు.
దాత కాశిరెడ్డి రవీందర్ రెడ్డికి సన్మానం
తన తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు టై, బెల్టులు అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి కూడా కృషి చేస్తానని కాశిరెడ్డి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆయనను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం తౌరియా నాయక్ సభాధ్యక్షత వహించారు. కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, లయన్ డాక్టర్ పి.జె. శ్యామ్సన్, మాజీ సర్పంచ్ రేపాని ఇద్దయ్య, వనం శ్రీనివాసులు, జల్దా భాస్కర్, బొడ్డుపల్లి భీష్మాచారి, ఉపాధ్యాయులు పి. లక్ష్మి, పి. రాధారాణి, కె. లక్ష్మణ్, సిహెచ్. వెంకటేశ్వర్లు, వి. శ్రీనివాస్, వజీర్, ఎం. అంజయ్య , ఎం. సులోచనతో పాటు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply