హంగర్ రిలీఫ్‌లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర సంయుక్త సేవా కార్యక్రమం
దేవరకొండ, అక్టోబర్ 1, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్‌లు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ గుద్దేటి జంగయ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర ప్రెసిడెంట్ వనం యాదమ్మ తెలిపారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఫాస్ట్ ప్రెసిడెంట్ వనం భిక్షమయ్య, యాదమ్మల మనుమడు నీఊరి ఆర్యన్ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం దేవరకొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హంగర్ రిలీఫ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 300 మంది రోగులు, వారి అటెండర్లకు ఉచితంగా కిచిడీ అల్పాహారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ సేవే పరమార్థంగా లయన్స్ క్లబ్‌లు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర రంగాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
అల్పాహార పంపిణీ కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి సహకరిస్తుండటం సంతోషకరమని తెలిపారు. జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు లయన్స్ క్లబ్‌తో కలిసి ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, వనం భిక్షమయ్య, లయన్స్ గాజుల రాజేష్, నీల బుచ్చయ్య, ఆవిర్నేని వెంకటేశ్వరరావు, వనం శ్రీనివాసులు, తిరందాసు పార్వతి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply