Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › మెట్రో రైల్‌–సిటీ బస్సులకు ఒకటే పాస్
బ్రేకింగ్ న్యూస్

మెట్రో రైల్‌–సిటీ బస్సులకు ఒకటే పాస్

05:56 తెల్లవారుజాము AM

నేటి నుంచి అమల్లోకి రానున్న ‘కామన్ పాస్’ విధానం

హైదరాబాద్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పరిధిలోని ప్రయాణికులకు టీజీఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ సంయుక్తంగా శుభవార్త అందించాయి. నగరంలో బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి వేర్వేరు పాస్‌లకు బదులుగా ఒకే ‘కామన్ పాస్’ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

రోజూ లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సుమారు 25 లక్షల మంది, మెట్రో రైల్ మూడు కారిడార్లలో రోజుకు సుమారు నాలుగున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వేర్వేరు టికెట్లు లేదా పాస్‌లు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులకు ఆర్థిక భారంతో పాటు సమయం కూడా వృథా అవుతున్న నేపథ్యంలో బస్సులు, మెట్రో రైళ్లకు కలిపి ఒకే పాస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ఈ ‘కామన్ పాస్’ విధానం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ప్రజాభవన్‌లో జరిగే కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ ఈ విధానాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 19🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App