మంథని మహిళా జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు
చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం అందరి బాధ్యత
మంథని, నవంబర్ 6, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని మంథని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బి. అనురాధ సూచించారు. శుక్రవారం మంథని మహిళా జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ బి. అనురాధ మాట్లాడుతూ, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే చట్టాల గురించి తెలుసుకోవడం అవసరమని తెలిపారు.
విద్యార్థుల్లో న్యాయపరమైన అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి న్యాయ విజ్ఞాన సదస్సులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె. రగోత్తమ్ రెడ్డి, న్యాయవాది శశిభూషణ్ కాచే, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఝాన్సీ, అధ్యాపకుడు రావుల తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply