దేవరకొండ, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
చందంపేట మండలం చిత్రియాలు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి జాతర, కంఠా మహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం నిర్వాహకులు వడ్త్య రమేష్‌ను శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చిత్రియాలు సర్పంచ్ చాట్ల చిరంజీవి, మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్, బోయపల్లి రాములు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రామలింగం, పవన్, శ్రీశైలం తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










Leave a Reply