పండగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: ఎమ్మెల్యే
అంకాలమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
చందంపేట, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామంలో నిర్వహించిన అంకాలమ్మ సావ, కాటమయ్య స్వామి ఉత్సవాల్లో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కాకునూరి రంగయ్య గౌడ్ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. తెల్లవారుజామున అంకాలమ్మ తల్లికి తొలి సేవ, మలి సేవ, జల్ది కార్యక్రమాలు నిర్వహించగా.. అనంతరం కాటమయ్య స్వామి కల్యాణం, ఎల్లమ్మ బోనాల కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహించే అంకాలమ్మ సావ కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలను అంకాలమ్మ తల్లి చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ప్రజలంతా పండగలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.
అంకాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామంలో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాకునూరి రంగయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, మారుపాకుల సురేష్ గౌడ్, ముక్కమాల వెంకటయ్య గౌడ్, కిన్నెర హరికృష్ణ, ఏడుపుల గోవిందు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బద్య నాయక్, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply