Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › ఆంధ్రప్రదేశ్ › ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే, టైక్వాండో పోటీల్లో ఆర్‌బీ డ్రాగన్స్ క్రీడాకారుల ప్రతిభ
ఆంధ్రప్రదేశ్

ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే, టైక్వాండో పోటీల్లో ఆర్‌బీ డ్రాగన్స్ క్రీడాకారుల ప్రతిభ

11:39 ఉదయం AM

వివిధ విభాగాల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు

గుంటూరు: సెప్టెంబర్ 27 (AYUSH24 News ప్రతినిధి)

గుంటూరులోని విహెచ్ హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ కరాటే, టైక్వాండో పోటీల్లో ఆర్‌బీ డ్రాగన్స్ షటోకాన్ కరాటే సంస్థకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మొత్తం 250 మంది బాలబాలికలు పాల్గొనగా, ఆర్‌బీ డ్రాగన్స్ షటోకాన్ కరాటే సంస్థ నుంచి 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ పోటీలకు చీఫ్ రెఫరీగా పి. రాంబాబు వ్యవహరించగా, జి. సాయిరాం న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

కటా విభాగంలో బాలుర 8 సంవత్సరాల విభాగంలో ఓ. తేజదీప్, 14 సంవత్సరాల విభాగంలో ఎ. ఈక్షన్ బంగారు పతకాలు సాధించారు. బాలికల 10 సంవత్సరాలలోపు విభాగంలో కె. వాత్సల్య, ఎం. శివ శ్రావణి బంగారు పతకాలు సాధించారు.

కుమిటే విభాగంలో బాలుర 11 సంవత్సరాలలోపు విభాగంలో వై. మితిన్, 14 సంవత్సరాలలోపు విభాగంలో ఎస్‌డీ అజ్మీర్, 20 సంవత్సరాలలోపు విభాగంలో జి. మహేష్ బంగారు పతకాలు సాధించారు. బాలికల 11 సంవత్సరాలలోపు విభాగంలో కె. చైత్ర బంగారు పతకం సాధించింది.

పతకాలు సాధించిన క్రీడాకారులను సంస్థ ఏపీ ప్రెసిడెంట్ ఓ. శివకృష్ణ, సెక్రటరీ ఎ. రవికుమార్, సత్తెనపల్లి కోచ్ జి. రవి తదితరులు అభినందించారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 38🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
98 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App