Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ
Home › బ్రేకింగ్ న్యూస్ › ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నల్లగొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
బ్రేకింగ్ న్యూస్

ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నల్లగొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

నల్లగొండ, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో త్వరలో నిర్వహించనున్న పోలీస్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో పోటీ పడుతున్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర

05:12 సాయంత్రం PM

అర్హులైన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

నల్లగొండ, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో త్వరలో నిర్వహించనున్న పోలీస్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో పోటీ పడుతున్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన 500 మంది నిరుద్యోగ యువతీ యువకులను ఎంపిక చేసి, నల్లగొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

ఈ శిక్షణలో పోలీస్ నియామక పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన శారీరక దారుఢ్య శిక్షణ (ఫిజికల్ ట్రైనింగ్), రాత పరీక్ష సిలబస్‌పై బోధన, మాక్ టెస్టులు, పరీక్షా విధానంపై అవగాహన, నిపుణుల మార్గదర్శకత్వం తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యాలను కూడా ఉచితంగా కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

అనుభవజ్ఞులైన శిక్షకులు, నిపుణుల ఆధ్వర్యంలో క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందిస్తూ, రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్లలోనూ మెరుగైన ప్రతిభ కనబరిచేలా అభ్యర్థులను తీర్చిదిద్దనున్నట్లు ఎస్పీ తెలిపారు.

స్క్రీనింగ్ టెస్ట్‌కు నమోదు

స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తమ వివరాలను కింది గూగుల్ ఫామ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Google Form:
https://forms.gle/Ha8ZK33Y1emVCKmx6

అలాగే ఎస్‌ఐ/కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న పార్ట్-1 అప్లికేషన్ ఫామ్ ప్రతిని అభ్యర్థులు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.

సెప్టెంబర్ 20న స్క్రీనింగ్ టెస్ట్

తేదీ: 20-09-2026, ఆదివారం
సమయం: ఉదయం 9:00 గంటలకు ముందుగా

సంబంధిత సబ్‌ డివిజన్‌కు చెందిన అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకుని స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరు కావాలని జిల్లా ఎస్పీ సూచించారు.

నల్లగొండ సబ్‌ డివిజన్:
ఎన్‌.జి. కళాశాల, నల్లగొండ

మిర్యాలగూడ సబ్‌ డివిజన్:
మీనా ఇంజినీరింగ్ కళాశాల, మిర్యాలగూడ

దేవరకొండ సబ్‌ డివిజన్:
కృష్ణవేణి టాలెంట్ స్కూల్, మీనాక్షి సెంటర్స్, డిండి క్రాస్ రోడ్

నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో శిక్షణ పొంది పోలీస్ ఉద్యోగం సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆకాంక్షించారు.

అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో వివరాలు అడిగి తెలుసుకోవచ్చని తెలిపారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 28🔗 Shares: 7👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
262 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App