కరీంనగర్, సెప్టెంబర్ 20 (ప్రతినిధి):
కరీంనగర్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురు అనారోగ్య బాధితులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కరీంనగర్‌లోని అపోలో హాస్పిటల్లో రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన తడక శ్రీనివాస్, తాడిచర్ల గ్రామానికి చెందిన చల్ల కిష్టయ్య చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మంత్రి వారిని పరామర్శించారు.
అనంతరం ఏవన్ హాస్పిటల్లో మంథని మండలం కాకర్లపల్లె గ్రామానికి చెందిన బూడిది గణేష్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఆదర్శ హాస్పిటల్లో ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన జడల నాగరాజు సతీమణి సంధ్యారాణి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని ఆమెను పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రుల వైద్యులను కోరారు. బాధితులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.











Leave a Reply