కరీంనగర్ జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సంతోష్ ఆదేశాల మేరకు డీటీఎఫ్ కరీంనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. దుర్గాభవాని ఆధ్వర్యంలో అధికారులు టవర్ సర్కిల్లోని లేబర్ అడ్డా వద్ద తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన లింగంపల్లి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకోగా, వాటి మొత్తం బరువు 908 గ్రాములుగా గుర్తించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలతో పాటు నిందితుడిని కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాభవాని మాట్లాడుతూ, గంజాయి విక్రయించడం, సరఫరా చేయడం, నిల్వ ఉంచడం చట్టవిరుద్ధమని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, గంజాయి సంబంధిత సమాచారం తెలిస్తే వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.
— ఆయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్
కరీంనగర్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
కరీంనగర్ జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్,


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply