ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
కుల్కచర్ల, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కుల్కచర్ల మండలంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పరిగి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply