ప్రకృతి పరిరక్షణకు ఆయన చేస్తున్న సేవలు అభినందనీయం: మంథని సీఐ బుద్దె స్వామి
మంథని, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:
ప్రకృతి ప్రేమికుడిగా గుర్తింపు పొందిన గట్టు కృష్ణమూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి అన్నారు.
ఆదివారం మధ్యాహ్నం మంథని పోలీస్ స్టేషన్లో గట్టు కృష్ణమూర్తిని సీఐ బుద్దె స్వామి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని ప్రాంతంలో వృక్ష సంపదను పెంపొందించేందుకు కృష్ణమూర్తి చేస్తున్న సేవలు ఎల్లకాలం గుర్తుండిపోతాయని అన్నారు.
ఉద్యోగ విరమణ అనంతరం సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదైనా మంచి పని చేయాలనే సంకల్పంతో కృష్ణమూర్తి మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
మంథనిలో పలు ప్రాంతాల్లో నాటిన మొక్కలకు సరైన సంరక్షణ లేకపోవడం, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి సీఐ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన సీఐ బుద్దె స్వామి మొక్కల సంరక్షణకు అవసరమైన రక్షణ కల్పించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply