Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి: కంచర్ల కాశయ్య
బ్రేకింగ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి: కంచర్ల కాశయ్య

10:24 ఉదయం AM

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టాలి

సర్వారెడ్డి సేవలు చిరస్మరణీయం

తాడేపల్లి | అయుష్ 24 న్యూస్

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని సీపీఐ తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాశయ్య పిలుపునిచ్చారు.

మంగళవారం తాడేపల్లిలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్‌లో బుర్ర ముక్కు సర్వారెడ్డి 12వ వర్ధంతి సభ సీపీఐ తాడేపల్లి ప్రాంత సహాయ కార్యదర్శి తుడిమెల్ల వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. ముందుగా సీనియర్ నాయకులు మానికొండ డాంగే సర్వారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాశయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్య ప్రజలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

సర్వారెడ్డి తాడేపల్లి ప్రాంతంలో ప్రజా సమస్యలు, కార్మికులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని తుడిమెల్ల వెంకటయ్య, రైతు నాయకుడు పెద్ది శెట్టి వీరస్వామి అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో మానికొండ డాంగే, ఉద్దంటే శివ, మునగాల రామారావు, షేక్ బాషా, శీలం శ్యామ్ ప్రసాద్, ఎన్. లక్ష్మణ్, లంకె ప్రసన్న, శీలం అనిల్ కుమార్, లంకె ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *