పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారుల పరిశీలన
దేవరకొండ, సెప్టెంబర్ 10 (అయుష్ 24 న్యూస్): వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాల అనంతరం గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా దేవరకొండ పట్టణంలోని కొండ భీమనపల్లి చెరువును గురువారం పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించారు.
దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, తహసీల్దార్ సంజీవ్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ ఏఈ తదితరులు చెరువు పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా చెరువులో నీటి నిల్వ పరిస్థితి, నిమజ్జనానికి అనుకూలత, రహదారి సౌకర్యం, విద్యుత్ సరఫరా తదితర అంశాలను పరిశీలించినట్లు తెలిపారు.
నిమజ్జన సమయంలో ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. రహదారి మార్గం, విద్యుత్ అంతరాయాలు తదితర సమస్యలను గుర్తించి వాటికి తగిన పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డి, తహసీల్దార్ సంజీవ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, ఆర్ఐ కర్ణాకర్ రెడ్డి, జీపీఓ రామ్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ రాజేష్, మున్సిపల్ ఏఈ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply