డిండి: గిరిజనుల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన చారిత్రక నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా డిండి మండలం దేవత్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ హాజరై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా వడ్త్య రమేష్ మాట్లాడుతూ.. గిరిజనుల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడం గిరిజనుల ఆత్మగౌరవానికి ఇచ్చిన గౌరవంగా అభివర్ణించారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం పోడు భూముల హక్కులు, విద్య, ఉపాధి, పారిశ్రామిక ప్రోత్సాహం తదితర అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు.
చారిత్రక నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా గిరిజన, ఆదివాసీ వర్గాల తరఫున కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ సరియ్య నాయక్, మాజీ సర్పంచ్ కాట్రావత్ వెంకటేష్, ఉప సర్పంచ్ విజయ్, అరుణ్ నాయక్, లచ్చిరం నాయక్, ప్రకాష్, కిషన్ బొవోజి, రాము నాయక్, శోభన్, కిషన్, మోతిలాల్, వెంకట్, దాస్రు, మధు, శ్రీకాంత్ తదితరులతో పాటు గ్రామపంచాయతీ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.
— Ayush 24 News
The Voice of Truth
గిరిజన రిజర్వేషన్ల పెంపునకు నాలుగేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నేతల పాలాభిషేకం
డిండి: గిరిజనుల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన చారిత్రక నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా డిండి మండలం దేవత్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply