చిన్నారి తొలిసారి అన్నం స్వీకరించిన వేళ.. కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు
ముత్తారం, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నప్పటికీ, కుటుంబంలో చిన్నారి తొలిసారిగా అన్నం స్వీకరించే అన్నప్రాశన వేడుక ప్రతి కుటుంబానికీ ప్రత్యేకమైన, ఆనందకరమైన సందర్భమని చెప్పవచ్చు. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన కొడారి మల్లేష్ యాదవ్ కుటుంబంలో మనవడి అన్నప్రాశన వేడుకను రామగిరి మండలం లద్నపూర్లోని శ్రీ గోదా రంగనాయక స్వామి దేవాలయంలో సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పురోహితుడు చిన్నారికి సంప్రదాయబద్ధంగా అన్నప్రాశన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ సంప్రదాయాలను పాటిస్తూ చిన్నారి తొలిసారిగా అన్నం స్వీకరించిన మధుర క్షణాలు కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తాయి.
చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఎదిగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు స్వామివారిని ప్రార్థించారు.
ఈ శుభకార్యంలో చిన్నారి తల్లి తొట్ల రమ్యశ్రీ, తండ్రి సంపత్ ప్రేమాభిమానాలతో తమ కుమారుడికి అన్నప్రాశన చేయించారు. చిన్నారి తాత కొడారి మల్లేష్ యాదవ్, అమ్మమ్మ రాజమణి, మేనమామ రక్షిత్ కుమార్, అబ్బాయి తరఫు తల్లిదండ్రులు తొట్ల బంగారక్క, రాజయ్య, పెద్దనాన్న రవి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
అయుష్ 24 న్యూస్ | The Voice of Truth









Leave a Reply