పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ – PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి
చందంపేట: మండలంలోని పోలేపల్లి క్రాస్ రోడ్డులో శ్రీ వడిత్యా రమేష్ నాయక్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన పయనీర్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ శ్రీ జాలే నరసింహారెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గంలోని పేద ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వడిత్యా రమేష్ నాయక్‌ను అభినందించారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
చందంపేట మండల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నరసింహారెడ్డి కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల ప్రజలు పాల్గొన్నారు.
— Ayush 24 News
చందంపేటలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ప్రారంభం
పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ – PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి చందంపేట: మండలంలోని పోలేపల్లి క్రాస్ రోడ్డులో శ్రీ వడిత్యా రమేష్ నాయక్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన పయనీర్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభమైంది. ఈ
05సెప్టెంబర్2026
06:51 ఉదయం AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →
Mahamood Mohammed






Leave a Reply