పెద్దపల్లి జిల్లా, సెప్టెంబర్ 8: ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయనున్న ఆటో సంక్షేమ బోర్డు బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో నిర్వహించిన ఆటో జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో కార్మికుల సమస్యలపై చర్చల పేరుతో కాలయాపన చేయకుండా, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సంక్షేమ బోర్డు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు.
అలాగే ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ఆటో జేఏసీ ధర్నాను విజయవంతం చేయాలని ఆటో కార్మికులకు పిలుపునిచ్చారు.
జిల్లా కన్వీనర్ ఎనగందుల నాంపల్లి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఎస్కే జబ్బర్, జిల్లా కో-కన్వీనర్లు బందరపు కుమార్, బండ సురేష్, తాడూరు రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎలిగేడు మండల ఆటో జేఏసీ అధ్యక్షుడిగా ఎం. లక్ష్మణ్‌ను నియమించారు. జిల్లా కో-కన్వీనర్లుగా పందిరి లక్ష్మణ్, కే. ప్రతాప్, జాయింట్ కన్వీనర్‌గా సీహెచ్. రాజును ఎన్నుకున్నారు.
మండల ఉపాధ్యక్షుడిగా ఎస్. తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా చంద్రయ్య, సహాయ కార్యదర్శిగా లక్ష్మణ్, కార్యదర్శిగా సతీష్, సలహాదారుడిగా ఎండీ. చాంద్, సలహాదారులుగా సీహెచ్. సంపత్, సీహెచ్. శ్రీనివాస్, సీహెచ్. మల్లేష్ తదితరులను ఎన్నుకున్నారు.
ఆటో కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలకు సంఘటితంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.
– అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, పెద్దపల్లి జిల్లా









Leave a Reply