రాంప్జీ నాయిక్ హాస్పిటల్లో ప్రతిరోజూ ఉచితంగా జనరల్ ఓపీ సేవలు
అయుష్ 24 న్యూస్: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రాంప్జీ నాయిక్ హాస్పిటల్లో ప్రతిరోజూ ఉచితంగా జనరల్ ఓపీ సేవలు అందించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.
సివిల్ సర్జన్ డాక్టర్ రవి ప్రకాష్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉండే ఈ సేవల్లో సాధారణ వైద్య పరీక్షలతో పాటు బీపీ, షుగర్, జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలకు వైద్య సలహాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కడుపు నొప్పి తదితర సమస్యలకు కూడా జనరల్ ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.
తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఈ ఉచిత జనరల్ ఓపీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వైద్య సేవలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 7981168193 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.



Musini.Anjan





Leave a Reply