మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సేవలు
దేవరకొండ, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): దేవరకొండ, నల్గొండకు చెందిన కేతావత్ నాగేశ్‌కు ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గోల్డెన్ నంది అవార్డు–2026 లభించింది. Global Excellence Icon Awards–2026లో భాగంగా ఈ పురస్కారాన్ని అందించనున్నారు.
కేతావత్ నాగేశ్ ప్రస్తుతం మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు తాగునీటి వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం వంటి అంశాలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అవార్డు నిర్వాహకులు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సెప్టెంబర్ 20న నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. కార్యక్రమాన్ని Amateur Sports & Culture Awards Association ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, మాస్టర్ కేశవ్ గౌడ్ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కేతావత్ నాగేశ్‌కు కుటుంబ సభ్యులు, మిత్రులు, సహచరులు, దేవరకొండ ప్రాంత ప్రజలు అభినందనలు తెలిపారు.
🏆 గ్లోబల్ గోల్డెన్ నంది అవార్డు–2026కు ఎంపికైన కేతావత్ నాగేశ్ గారికి ఆయుష్ 24 న్యూస్ తరఫున హృదయపూర్వక అభినందనలు. 💐👏
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply