కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, BRS రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్
దేవరకొండ: దేవరకొండ మండలానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు పల్లా నరసింహారెడ్డి గారి కుమారుడు దివంగత పల్లా సుధీర్ రెడ్డి గారి దినదశ కర్మ (దినకార్యక్రమం) శుక్రవారం దేవరకొండ మండల కేంద్రంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ హాజరయ్యారు. సుధీర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పల్లా నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, సుధీర్ రెడ్డి చిన్న వయసులోనే అకాల మరణం చెందడం పల్లా నరసింహారెడ్డి కుటుంబానికే కాకుండా ఈ ప్రాంతానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత సుధీర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో BRS మండల అధ్యక్షులు TVN రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుభాష్ గౌడ్‌తో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత పల్లా సుధీర్ రెడ్డికి నివాళులర్పించారు.
— Ayush 24 News
The Voice of Truth
పల్లా సుధీర్ రెడ్డి దినదశ కర్మలో ముఖ్య నాయకులు
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, BRS రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ దేవరకొండ: దేవరకొండ మండలానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు పల్లా నరసింహారెడ్డి గారి కుమారుడు దివంగత పల్లా సుధీర్ రెడ్డి గారి దినదశ కర్మ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply