రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
పాలేరు, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్:
పాలేరు నియోజకవర్గ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాలేరు పాత కాల్వ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పాత కాల్వ ద్వారా నీటి విడుదలకు మంత్రి ఆదేశాలు జారీ చేయడంతో కాల్వ పరిధిలోని గ్రామాల రైతులకు సాగునీరు అందుబాటులోకి రానుంది. దీంతో పంటలకు అవసరమైన నీరు అందడంతో రైతులకు ఊరట కలగనుంది.
పాలేరు నియోజకవర్గంలోని సాగునీటి అవసరాలపై అధికారులు తగిన చర్యలు తీసుకుని, రైతులకు ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా జరిగేలా చూడాలని మంత్రి సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో పాత కాల్వ పరిధిలోని రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.









Leave a Reply