విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు
కడం, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): విద్యార్థులు పోటీ తత్వంతో ముందుకు సాగినప్పుడే తమ విద్యా సామర్థ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకోగలరని కడం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. శ్రీనివాసరెడ్డి అన్నారు.
శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యాభివృద్ధి కోసం ఏకలవ్య ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన అభినందించారు. నూజివీడు సీడ్స్ సంస్థ ఆర్థిక సహకారం అందిస్తూ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతోందని తెలిపారు.
విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు నారాయణ, ఆర్పియా, సరయు, యోగిత తదితరులకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. వెంకటరమణ, సుజాత, రమేష్ కుమార్, వినోద్ కుమార్, మురళి, మధుకర్, శివకుమార్, మహేష్ కుమార్, వెంకట రాములు, శోభారాణి, గోదావరి, నారాయణ వర్మ, నాగరాజు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply