మూలమలుపులో మట్టి కుప్ప.. అధికారుల నిర్లక్ష్యంపై వాహనదారుల ఆగ్రహం
అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?
మంథని, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): పెద్దపల్లి జిల్లా మంథని లైన్గడ్డ సమీపంలోని ప్రధాన రహదారిపై మూలమలుపు వద్ద మట్టి కుప్ప ప్రమాదకరంగా పేరుకుపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారిపై మట్టి కుప్ప ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు తొలగించకపోవడంపై వాహనదారులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూలమలుపు కావడంతో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. రహదారిపై ప్రమాదకర పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
“ప్రమాదం జరగడానికి ముందే కనిపిస్తున్న మట్టి కుప్పను తొలగించలేరా? ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందించాలా?” అంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రధాన రహదారిపై ఉన్న మట్టి కుప్పను వెంటనే తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. అలాగే ఆర్అండ్బీ అధికారులు కూడా రహదారి భద్రతపై దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించేలోపు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply