రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుకు సంఘీభావంగా మెదక్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు
మెదక్, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు మెదక్ జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలపాలని జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఫీజు బకాయిలు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ, రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆగస్టు 24, 25 తేదీల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిర్వహిస్తున్న ఈ నిరాహార దీక్షకు మద్దతుగా ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
జిల్లా స్థాయి నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల, పట్టణ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ వెంట విద్యార్థులను తీసుకుని కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షుడి నిరాహార దీక్షకు సంఘీభావం తెలపాలని వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
ఇట్లు
వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్
బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు
— అయుష్ 24 న్యూస్










Leave a Reply