హైదరాబాద్‌లో పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం
హైదరాబాద్, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:
హైదరాబాద్‌లోని రాజమౌలాలో గల పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లుగా ఎన్నికైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంథని మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన ఓద్నాల శ్రీనివాస్‌ను పద్మశాలి సంఘం ప్రతినిధులు, కులబాంధవులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వీరభద్రిని అనిల్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ దుడెం వెంకటరమణ, ఎల్. రమణ, గుండు సుధారాణి, పెద్దపల్లి జిల్లా చైర్మన్ వలస నీలయ్య, మాజీ సర్పంచ్ బిముని వెంకటేశ్వామి, సర్పంచ్ నాగుల రాజయ్య, మాజీ సర్పంచ్ రామ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కులబాంధవులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై ఓద్నాల శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఓద్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ తనను ఘనంగా సన్మానించి అభినందించిన పద్మశాలి సంఘాల ప్రతినిధులకు, నాయకులకు, కులబాంధవులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply