మృతదేహంపై కాంగ్రెస్ జెండా కప్పి నివాళులర్పించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్
కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సాయం
కేతపల్లి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి మండలం కొర్లపాడు గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సూరారపు వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ కొర్లపాడు గ్రామానికి చేరుకుని వెంకన్న మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా వెంకన్న మృతి పట్ల దైద రవీందర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గార్లపాటి రవీందర్ రెడ్డి, కొర్లపాడు మాజీ సర్పంచ్ కుమ్మరి నాగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు భయ్యా అంజయ్య యాదవ్, ఇప్పలగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు సైదులు యాదవ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ బుర్రయ్య, భద్రయ్య, అంజిబాబు, ప్రశాంత్, లింగరాజు, బబ్లు, ఆవుదొడ్డి లింగయ్య, ఎడ్ల శీను, మహేష్, ప్రవీణ్, సూరారపు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply