కీర్తిశేషులు చిత్తనూరి రాముడు జ్ఞాపకార్థం నిత్యావసర వస్తువులు, పండ్ల పంపిణీ
దేవరకొండ, సెప్టెంబర్ 3 (అయుష్ 24 న్యూస్): వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ కె.సి. గుప్తా జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు దేవరకొండ వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
దేవరకొండ పట్టణంలోని స్థానిక మహాలక్ష్మి వయోవృద్ధ ఆశ్రమంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు చిత్తనూరి రాముడు జ్ఞాపకార్థం, ఆయన భార్య రోజా రాణి ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్, బకెట్లు, గిన్నెలు, పండ్లు తదితర సామగ్రిని ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు.
ఈ సందర్భంగా వృద్ధులకు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా మానవతా విలువలను చాటుకోవడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ సమాజానికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ అధ్యక్షురాలు పందిరి జ్యోతి, డిస్ట్రిక్ట్ జాయింట్ ట్రెజరర్ ఆలంపల్లి పద్మ, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ నీలా సంజీవ కుమార్, వాసవి వనిత క్లబ్ కార్యదర్శి బెజవాడ మల్లేశ్వరి, కోశాధికారి ఆలంపల్లి శిరీష తదితరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply