రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు.. మెమొంటోతో సత్కారం
దేవరకొండ, సెప్టెంబర్ 1, 2026 | అయుష్ 24 న్యూస్: దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్ విదేశీ పర్యటన ముగించుకుని దేవరకొండ నియోజకవర్గానికి తిరిగి చేరుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రమేష్‌తో ఆత్మీయంగా మాట్లాడి విదేశీ పర్యటన విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మెమొంటోతో రమేష్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాఘవచారి, సరియా నాయక్, ప్రకాష్, నరసింహ, మహేష్, సత్యం, నరేందర్, బీమా నాయక్, జాగ్రూ బావోజీ, కోటేష్, రామకృష్ణ, వెంకటేష్, బాలాజీ, విజయ్, భాస్కర్, నరేష్, జయంత్, అరుణ్, పీర్ మహమ్మద్, బసీద్, గోపాల్, పుల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ 📰










Leave a Reply