తొలి విడతలో 243 స్థలాల వేలం
విశాఖపట్నం, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన భూముల వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌కు చెందిన మొత్తం 459 భూముల వేలం ప్రక్రియను నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (NLMC) చేపడుతోంది.
వేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు వివరాలు తెలియజేసేందుకు NLMC ఆధ్వర్యంలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 23న విశాఖపట్నంలో, 24న విజయవాడలో, 25న హైదరాబాద్‌లో సమావేశాలు జరగనున్నాయి.
తొలి విడతలో హెచ్‌బీ కాలనీ, మద్దిలపాలెం, గాజువాక ఆటోనగర్ ప్రాంతాల్లోని మొత్తం 93,572.21 చదరపు గజాల భూముల్లో 243 స్థలాలను అక్టోబర్ 12న వేలం వేయనున్నట్లు సమాచారం.
వేలం ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలు పెట్టుబడిదారుల సమావేశాల్లో వెల్లడించే అవకాశం ఉంది.










Leave a Reply