వరంగల్, సెప్టెంబర్ 5 (అయుష్ 24 న్యూస్): వరంగల్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం శ్రీకృష్ణుడి లీలలను ప్రతిబింబించేలా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తోటకూర అజయ్ యాదవ్ వీక్షించారు. శ్రీకృష్ణుడి పాటలకు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్, హర్ష, రాణా యాదవ్‌తో పాటు యాదవ సంఘం నాయకులు, సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










Leave a Reply