రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎచ్చ చంద్రయ్య విరాళం
దేవరకొండ, సెప్టెంబర్ 2 | అయుష్ 24 న్యూస్
దేవరకొండ పట్టణంలోని సరస్వతి విద్యామందిర్ పాఠశాల అభివృద్ధికి పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎచ్చ చంద్రయ్య రూ.25 వేల ఆర్థిక సహాయం అందించారు.
పాఠశాలను సందర్శించిన చంద్రయ్య ఈ మొత్తాన్ని ప్రధానోపాధ్యాయురాలు నవ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తిరిగి ప్రారంభమైన సరస్వతి విద్యామందిర్ భవిష్యత్తులో వెయ్యి మంది విద్యార్థులతో కళకళలాడాలని ఆకాంక్షించారు.
కొంతకాలంగా మూతపడి ఉన్న పాఠశాలను రిటైర్డ్ ఉపాధ్యాయుడు దామెర మురళి నేతృత్వంలో తిరిగి ప్రారంభించడం అభినందనీయమన్నారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని, పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply