Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి
Home › బ్రేకింగ్ న్యూస్ › 📰 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్‌కు పోలిక ఎక్కడిది?: ఎమ్మెల్యే కోరం కనకయ్య
బ్రేకింగ్ న్యూస్

📰 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్‌కు పోలిక ఎక్కడిది?: ఎమ్మెల్యే కోరం కనకయ్య

03:57 మధ్యాహ్నం PM

బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలు నిరాధారమైనవని ఎమ్మెల్యే విమర్శ

ఇల్లందు, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్రంగా ఖండించారు. ఇల్లందులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ, కేవలం రూ.1 జీతం తీసుకుంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం బీఆర్‌ఎస్‌ నాయకులకే చెల్లిందని విమర్శించారు.

ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఫాంహౌస్‌లో జీవితం గడిపిన మాజీ సీఎం కేసీఆర్‌తో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పోలిక ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో అనేక లోపాలు ఉన్నాయని, దాని కారణంగా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

ధరణికి బదులుగా భూ భారతి వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల భూములు, ఆస్తుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. భూ భారతి అమలుతో ప్రజలకు మెరుగైన భూ సేవలు అందించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

🔹 22-ఏ అంశంపై స్పష్టత ఇవ్వాలి

22-ఏ నిబంధన కొత్తగా ప్రజా ప్రభుత్వంలో తీసుకువచ్చింది కాదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం నుంచే కొనసాగుతోందని ఎమ్మెల్యే అన్నారు. 22-ఏకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

🔹 మాక్ అసెంబ్లీపై ఎమ్మెల్యే విమర్శలు

ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉండగా, మాక్ అసెంబ్లీ పేరుతో ప్రత్యేకంగా సభ నిర్వహించడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసే విధంగా ఉందని కోరం కనకయ్య విమర్శించారు.

ఈ అంశంపై ప్రభుత్వం, స్పీకర్‌ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

🔹 ఆరు గ్యారెంటీల అమలుపై ప్రస్తావన

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.

పేదల కోసం ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళా సంఘాలకు బస్సులు తదితర కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పునాది వేసిందని తెలిపారు.

గత పదేళ్లలో కులాల వారీగా లోన్లు ఇస్తామని చెప్పి ప్రజలను బీఆర్‌ఎస్‌ మోసం చేసిందని కోరం కనకయ్య ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

– అయుష్ 24 న్యూస్

THE VOICE OF TRUTH

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 12🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
262 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App