నల్లగొండ: మిలాద్ ఉల్ నబీ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రవక్త బోధించిన కరుణ, మానవత్వం, సత్యసంధత వంటి గొప్ప విలువలను స్మరించుకున్నారు. యువత ప్రవక్త అడుగుజాడలను అనుసరిస్తూ సమాజ సేవలో ముందుండాలని సూచించారు. అనంతరం పలువురు స్వచ్ఛందంగా హాజరై రక్తదానం చేశారు.
కార్యక్రమంలో నల్లగొండ మిలాద్ కమిటీ అధ్యక్షుడు మసీయుద్దీన్, కార్యదర్శి అభిద్, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, వన్‌టౌన్ ఎస్సై ముత్తయ్య, ఎస్సీ, ఎస్టీ స్టేట్ ప్రెసిడెంట్ అడ్వకేట్ కట్టెల శివకుమార్, గౌస్ మొహియుద్దీన్ హాశం, జాఫర్, సయ్యద్ హాశం, ఎం.డి. సలీం, మొహితుల్లా, జునైద్ హస్మీ, షరీఫుద్దీన్, ఎం.డి. అలీముద్దీన్, ఎం.డి. ఇమ్రాన్, ఫసియుద్దీన్, ఉమేర్, నర్సిరెడ్డి, బ్లడ్ బ్యాంక్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి TSMESA ఆఫీస్ బేరర్లు డా. ఎ.ఎ. ఖాన్ గౌరవ అధ్యక్షులు మరియు మహమ్మద్ మోయిజ్ అధ్యక్షులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. సమాజానికి ఎంతో ఉపయోగకరమైన ఈ రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మిలాద్ కమిటీ ఆఫీస్ బేరర్లను వారు అభినందించారు.
📰 AYUSH 24 NEWS CHANNEL
The Voice of Truth
🩸 మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదానం 💐💐💐💐💐
నల్లగొండ: మిలాద్ ఉల్ నబీ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రవక్త బోధించిన కరుణ, మానవత్వం, సత్యసంధత వంటి గొప్ప విలువలను స్మరించుకున్నారు.
27ఆగస్టు2026
05:23 సాయంత్రం PM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →
Mahamood Mohammed






Leave a Reply