త్వరలో ఐటీ టవర్ ప్రారంభం: నరేష్ జాదవ్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): ఆదిలాబాద్ పట్టణ శివారులో నిర్మిస్తున్న ఐటీ టవర్ నిర్మాణ పనులను డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ శనివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్లోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించి పనుల పురోగతిని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో స్థానికంగానే ఐటీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఐటీ టవర్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అతి త్వరలోనే ఐటీ టవర్ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరుకానున్నట్లు నరేష్ జాదవ్ తెలిపారు.
ఐటీ రంగంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఐటీ టవర్ అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ యువతకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply