Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్‌చార్జిగా జరుపుల లక్ష్మీ తిరుపతి
బ్రేకింగ్ న్యూస్

కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్‌చార్జిగా జరుపుల లక్ష్మీ తిరుపతి

06:16 సాయంత్రం PM

రెండోసారి నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి
అభినందనలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్

దేవరకొండ ప్రతినిధి | సెప్టెంబర్ 9 | అయుష్ 24 న్యూస్

యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు చురుగ్గా పనిచేస్తున్న డిండి మండలం ప్రతాప్‌నగర్ గ్రామానికి చెందిన జరుపుల లక్ష్మీ తిరుపతిని నాగర్‌కర్నూల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జిగా రెండోసారి నియమించినట్లు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో లక్ష్మీ తిరుపతి కీలకంగా పనిచేశారని తెలిపారు. ఆమె సేవలను గుర్తించి మరోసారి జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.

సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు

నాగర్‌కర్నూల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జిగా రెండోసారి నియమితులైన జరుపుల లక్ష్మీ తిరుపతి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి, రాష్ట్ర ఇన్‌చార్జి ఖలీద్‌కు, కో-ఇన్‌చార్జిలు రోహిణి, భవ్యలకు కృతజ్ఞతలు తెలిపారు.

తన నియామకానికి ప్రత్యేకంగా సహకరించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని లక్ష్మీ తిరుపతి తెలిపారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 30🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *